Saturday, October 31, 2009

జనపాయ మసాలా వేపుడు

జనపాయ మసాలా వేపుడు
కావలసినవి
ఉడికించిన జనపాయ ముక్కలు: అరకేజీ,
మంచినీళ్ళు: రెండు కప్పులు,
నూనె: 100గ్రా||,
ఉల్లికాడల తురుము: ఒక కప్పు,
టొమాటో ముక్కలు: కప్పు,
కొత్తిమీర తురుము: అర కప్పు,
పచ్చిమిర్చి: మూడు,
కారం: టీస్పూను,
అల్లంవెల్లుల్లి ముద్ద: టీస్పూను,
పసుపు: పావు టీస్పూను,
మసాలాపొడి: టీస్పూను,
జీడిపప్పు పేస్ట్‌: ఒక టీస్పూను,
గసగసాల ముద్ద: ఒక టీస్పూను,
పచ్చికొబ్బరితురుము: ఒక టీస్పూను,
పుదీనా తురుము: రెండు స్పూన్లు,
ఉప్పు: తగినంత

తయారుచేసేవిధానం
కళాయిలో నూనె వేసి అది కాగగానే ఉల్లికాడ తురుము, అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా వేసి సువాసన వచ్చేవరకూ వేయించాలి. ఉప్పు, కారం, పసుపు, మసాలాపొడి, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. నూరుకున్న గసాలు, జీడిపప్పు ముద్దలు కూడా వేసి, మంచినీళ్లు పోసి కలపాలి. చేపగుడ్లముక్కలు వేసి కళాయిలోని ముక్కలన్నీ కలిసేలా ఓసారి ఎత్తి కుదపాలి. మూతపెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చి కొత్తిమీర చల్లి దించాలి. దీన్ని అన్నంలోనూ బ్రెడ్‌లోనూ కూడా వేడిగా తింటే బాగుంటుంది.

ముర్గ్‌ జిలాఫి షీక్‌

కావలసినవి
చికెన్‌ ఖీమా: అరకిలో, చిజ్‌తురుము: టీస్పూను, పచ్చిమిర్చి పేస్టు: టీస్పూను, అల్లంవెల్లుల్లి: టీస్పూను, వెల్లుల్లితురుము: అరటీస్పూను, జీలకర్రపొడి: అరటీస్పూను, క్యాప్సికమ్‌ ముక్కలు: అరకప్పు, కోడిగుడ్లు: మూడు, మిరియాలు: టీస్పూను, యాలకులపొడి: టీస్పూను, ఉప్పు: తగినంత.
తయారుచేసే విధానం
* చికెన్‌లో జీలకర్ర, మిర్చి ముద్ద, వెల్లుల్లి, అల్లంవెల్లుల్లిముద్ద, యాలకులపొడి, మిరియాలు, ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి.
* ఇప్పుడు ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్‌ ముక్కలతో కలిపి ఇనుప వూచలకి అంటించి, బీట్‌ చేసిన గుడ్డు సొనను దీనిమీద పోసి ఓవెన్‌లో రోస్ట్‌ చేయాలి లేదా నిప్పులమీద కాల్చాలి. ఇవి వేడి వేడిగా పుదీనా చట్నీతో వడ్డిస్తే బాగుంటాయి.

Friday, September 11, 2009

హైదరాబాదీ బిర్యాన

కావలసినవి
మటన్‌: కిలో(ముక్కలుగా కోయాలి), బాస్మతిబియ్యం: అరకిలో, ఉల్లిపాయలు: నాలుగు(సన్నగా ముక్కలుగా కోయాలి), అల్లంవెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు, కారం: 2 టీస్పూన్లు, కొత్తిమీర: కట్ట(సన్నగా తురమాలి), పుదీనా: చిన్న కట్ట, పచ్చిమిర్చి: 4(పొడవుగా కోయాలి), పెరుగు: 2 కప్పులు, పాలు: అరకప్పు, కుంకుమపువ్వు: చిటికెడు, నిమ్మకాయలు: 2, యాలకులు: ఆరు, లవంగాలు: 8, దాల్చినచెక్క: అంగుళం ముక్క, నూనె: ముప్పావుకప్పు, నెయ్యి: 2టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత
మటన్‌ ముక్కలకు పట్టించేందుకు: యాలకులు: నాలుగు, లవంగాలు: ఆరు, దాల్చినచెక్క: అంగుళం ముక్క, షాజీరా: టీస్పూను, మిరియాలు: అరటీస్పూను తయారుచేసే విధానం
1 మటన్‌ ముక్కల్ని శుభ్రంగా కడగాలి.
2 బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి పక్కన ఉంచాలి.
3 మటన్‌ముక్కలకు అల్లంవెల్లుల్లి, ఉప్పు, కారం, సగం కొత్తిమీర, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, నిమ్మరసం, మసాలదినుసులు, వేయించిన ఉల్లిముక్కలు అన్నీ పట్టించి ఓ రెండుగంటలు నాననివ్వాలి.
4 పాలల్లో కుంకుమపువ్వు వేసి నాననివ్వాలి.
5 మందపాటి పాన్‌ తీసుకుని మటన్‌ ముక్కలన్నీ వేసి తక్కువ మంటమీద 6డికించాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి.
7 అవి ఉడుకుతుండగానే బియ్యం కడిగి ఉంచాలి. విడిగా మరో మందపాటి గిన్నెలో 8 గ్లాసుల నీళ్లు పోసి అవి మరిగిన తరవాత యాలకులు, లవంగాలు, పలావు ఆకులు, దాల్చినచెక్క, కొద్దిగా ఉప్పు వేసి బియ్యం వేయాలి. అన్నం మూడువంతులు ఉడికాక నీళ్లు వంపేసి అన్నాన్ని వెడల్పాటి బేసిన్‌లో పొడిపొడిలాడుతున్నట్లుగా ఆరనివ్వాలి.
8 ఇప్పుడు మందపాటి పాత్ర లేదా ప్రెషర్‌పాన్‌ తీసుకుని అడుగున నెయ్యి రాసి సగం అన్నాన్ని అడుగున పరచాలి. దానిమీద ఉడికించిన మాంసం ముక్కల్ని ఒక పొరలా పేర్చాలి.ఈ ముక్కల్ని మిగిలిన అన్నంతో కప్పేయాలి. కుంకుమపువ్వు కలిపిన పాలను అన్నంమీద చిలకరించాలి. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ముక్కల్ని పైపైన చల్లి నెయ్యి వేయాలి. మూతపెట్టి తక్కువ మంటమీద అన్నం పూర్తిగా ఉడికేవరకూ ఉంచాలి. అన్నం ఉడికి మంచి వాసన వస్తుండగా దించి వెుత్తం కలపకుండా నెమ్మదిగా ముక్కల్నీ అన్నాన్నీ తీస్తూ వడ్డించాలి.

చీజ్‌ బాల్స్‌

కావలసినవి
బంగాళాదుంపలు: పావుకిలో, నిమ్మకాయ: ఒకటి, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: అరటీస్పూను, చిజ్‌: 150గ్రా., మీగడ: 50 మి.లీ., కోడిగుడ్డు: ఒకటి, బ్రెడ్‌పొడి: అరకప్పు, నూనె: వేయించడానికి సరిపడా. తయారుచేసే విధానం  బంగాళాదుంపల్ని మెత్తగా ఉడికించి పొట్టు తీసి చల్లారిన తరవాత మెత్తగా చిదిమి ముద్దలా చేయాలి.  ఈ ముద్దలో ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి ఉంచాలి.  చీజ్‌ను తురిమి అందులో మీగడ కలిపి ఉండలుగా చేయాలి.  ఒక్కో ఉండకూ బంగాళాదుంప మిశ్రమాన్ని అద్దుతూ గుండ్రని బంతుల్లా చేయాలి.  కోడిగుడ్డుని పగులగొట్టి సొన గిలకొట్టాలి. ఇప్పుడు ఈ ఉండల్ని సొనలో ముంచి బ్రెడ్‌పొడిలో దొర్లించి నూనెలో వేయించి తీయాలి. వేడివేడిగా తింటే బాగుంటాయి.

చీజ్‌ గార్లిక్‌ టోస్ట్‌

  


కావలసినవి

బ్రెడ్‌ముక్కలు: నాలుగు, వెల్లుల్లి: ఒకటి, చీజ్‌: 150గ్రా., మిరియాలపొడి: అరటీస్పూను, పచ్చిమిర్చి: 2, కొత్తిమీర: కట్ట, క్యాప్సికమ్‌: ఒకటి

తయారుచేసే విధానం

వెల్లుల్లిని సన్నగా కోయాలి. తరవాత చీజ్‌ను గ్రేటర్‌తో తురమాలి.

పచ్చిమిర్చిని సన్నగా కోయాలి.

క్యాప్సికమ్‌లో గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కోయాలి.

ఇవన్నీ ఓ గిన్నెలో వేసి కలిపి ఉప్పు, మిరియాలపొడి చల్లాలి.

ఈ మిశ్రమాన్ని బ్రెడ్‌ముక్కలమీద పెట్టి ఓవెన్‌లో 5 నిమిషాలు టోస్ట్‌ చేసి 4 ముక్కలుగా కోసి టొమాటో సాస్‌తో అందిస్తే సరి.

గ్రిల్‌డ్‌ చికెన

కావలసినవి
చికెన్‌ లెగ్‌: ఒకటి, ఉప్పు: తగినంత, నిమ్మకాయ: అరచెక్క, అల్లంవెల్లుల్లి ముద్ద: టీస్పూను, గట్టిపెరుగు: అరకప్పు, గరంమసాలా: అరటీస్పూను, మిరియాలపొడి: పావుటీస్పూను, కారం: పావుటీస్పూను, రెడ్‌ఆరెంజ్‌కలర్‌: చిటికెడు, కొత్తిమీర, పుదీనా ఆకుల ముద్ద: టీస్పూను, నూనె: 4 టీస్పూన్లు
తయారుచేసే విధానం  చికెన్‌ లెగ్‌కు చాకుతో గాట్లు పెట్టి ఉప్పు, నిమ్మరసం అద్ది నానబెట్టాలి.  ఓ గిన్నెలో పెరుగు వేసి అందులో గరంమసాలా, మిరియాలపొడి, కారం, ఆరెంజ్‌ కలర్‌, పుదీనా కొత్తిమీర ముద్ద కలిపి తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి చికెన్‌ లెగ్‌కి పట్టించాలి. దీన్ని అరగంటసేపు నానబెట్టాలి.
ఇప్పుడు నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని దానిమీద చికెన్‌ లెగ్‌ పెట్టి మసాలా కూడా దానిమీద పోసి మూతపెట్టాలి.
సన్నని మంటమీద 10 నిమిషాలు ఒకవైపు 10 నిమిషాలు మరోవైపు ఉంచి వేయించాలి. పూర్తిగా వేగిన తరవాత దించి పుదీనా చట్నీ లేదా ఏదైనా సాస్‌తో తింటే బాగుంటుంది.

Tuesday, February 3, 2009

షుజువాన్‌ ప్రాన్స్‌

కావలసినవి
రొయ్యలు(పెద్ద సైజువి): అరకిలో, రిఫైండ్‌ ఆయిల్‌: తగినంత, నీళ్లు: 2 కప్పులు, కార్న్‌ఫ్లోర్‌: 2 టీస్పూన్లు, మైదా: టీస్పూను, కోడిగుడ్డు: ఒకటి, ఉల్లికాడల తురుము: కప్పు, కొత్తిమీర తురుము: అరకప్పు, క్యారెట్‌ తురుము: అరకప్పు, బీన్స్‌(సన్నగా తరగాలి): అరకప్పు, పచ్చిమిర్చి: 4(సన్నముక్కలుగా కోయాలి), టొమాటో కెచప్‌: 2 టేబుల్‌స్పూన్లు, అల్లం-వెల్లుల్లి ముద్ద: టీస్పూను, గ్రీన్‌ చిల్లీ సాస్‌: టీస్పూను, కారం: అరటీస్పూను, మిరియాలపొడి: పావుటీస్పూను, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం: ఓ గిన్నెలో శుభ్రం చేసిన రొయ్యలు వేసి కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్‌, మైదా, అల్లం-వెల్లుల్లి ముద్ద, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి అవరసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి మిశ్రమం రొయ్యలకు పట్టేలా కలపాలి. ఇప్పుడు వీటిని నూనెలో పకోడీల మాదిరిగా దోరగా వేయించి తీయాలి.
సన్నగా తరిగిన క్యారెట్‌, బీన్స్‌ ముక్కల్ని సగం ఉడికించి చల్లార్చాలి.
కళాయిలో 2 టేబుల్‌స్పూన్లు నూనె పోసి కాగాక ఉల్లికాడలు, పచ్చిమిర్చి తురుముల్ని వేసి దోరగా వేయించాలి. తరవాత గ్రీన్‌ చిల్లీ సాస్‌, టొమాటో కెచప్‌, కారం, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. 2 కప్పుల నీళ్ళు పోసి వేయించిన రొయ్యల్ని వేయాలి. కొత్తిమీర తురుము, క్యారెట్‌, బీన్స్‌ ముక్కలు వేసి మీడియం సెగమీద వేయించి దించాలి.

ఫ్రైడ్‌ రైస్‌

కావలసినవి
చిట్టిరొయ్యలు: అరకిలో, బాస్మతి రైస్‌: అరకిలో(పదునుగా వండి వార్చాలి), కోడిగుడ్లు: 2(వీటిని ఉల్లిపాయలు లేకుండా పొరుటులా వేయించి ఉంచాలి), రిఫైండ్‌ ఆయిల్‌: అరకప్పు, క్యారెట్‌ ముక్కలు: అరకప్పు, బీన్స్‌: అరకప్పు(సన్నగా తరగాలి), ఉల్లికాడల తురుము: కప్పు, సోయాసాస్‌: టేబుల్‌స్పూను, గ్రీన్‌ చిల్లీ సాస్‌: టేబుల్‌స్పూను, వెల్లుల్లి ముద్ద: 2 టీస్పూన్లు, మిరియాల పొడి: అరటీస్పూను, పంచదార: పావుటీస్పూను,
అజినవోటో: పావుటీస్పూను, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం: రొయ్యల్ని ఉడికించాలి. క్యారెట్‌- బీన్స్‌ ముక్కల్ని కొద్దిగా ఉడికించి చల్లార్చాలి.
కళాయిలో నూనె కాగాక, వెల్లుల్లి ముద్ద వేసి అది వేగిన తరవాత రొయ్యలు కూడా వేసి కాస్త వేయించాలి. గ్రీన్‌ చిల్లీ, సోయాసాస్‌, మిరియాలపొడి, అజినవోటో, ఉప్పు, పంచదార వేయాలి. క్యారెట్‌-బీన్స్‌ముక్కలు కూడా వేసి, కొద్దిగా వేయించాలి. ఆ పైన ఉడికించిన అన్నం పొడిపొడిగా చల్లుతూ కలపాలి. చివరగా కోడిగుడ్డు పొరుటు, ఉల్లికాడల ముక్కలు, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి వేగంగా కలిపి కళాయి దించితే రొయ్యల ఫ్రైడ్‌ రైస్‌ రెడీ!

నువ్వుల రొయ్యలు

కావలసినవి
రొయ్యలు: అరకిలో, రిఫైండ్‌ ఆయిల్‌: తగినంత, తెల్ల నువ్వులు: 25గ్రా||, టొమాటో సాస్‌: 2 టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌ స్పూన్లు, బియ్యప్పిండి: 2 టేబుల్‌స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌: టేబుల్‌స్పూను, అల్లం-వెల్లుల్లిముద్ద: టీస్పూను, కారం: టీస్పూను, మిరియాలపొడి: పావుటీస్పూను, అజినవోటో: పావుటీస్పూను, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం: పొట్టుతీసి శుభ్రంచేసిన రొయ్యల్ని ఓ గిన్నెలో వేయాలి. అందులోనే నువ్వులు, టొమాటో సాస్‌, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్‌, అల్లం-వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, మిరియాల పొడి, అజినవోటో వేసి తగినన్ని నీళ్లు చల్లి కలిపి ఉంచాలి.
పది నిమిషాల తరవాత అన్నీ కలిపిన రొయ్యల్ని నూనెలో పకోడీల్లా దోరరంగులోకి వచ్చేవరకూ వేయించి తీయాలి.
వీటిమీద కొత్తిమీర చల్లి వేడివేడిగా వడ్డిస్తే రుచిగా ఉంటాయి

కైమా కార్న్‌ఫ్రైడ్‌బాల్స్‌

కావలసినవి
మటన్‌ కైమా: అరకేజీ,
నీళ్లు: తగినన్ని,
రిఫైండాయిల్‌: తగినంత,
నెయ్యి:50గ్రా||,
మైదా: 200గ్రా||,
కార్న్‌ఫ్లోర్‌: 100గ్రా||,
జీడిపప్పు పొడి: ఒక కప్పు,
ఎండుకొబ్బరి పొడి: ఒక కప్పు,
క్యారెట్‌ తురుము: ఒక కప్పు,
ఉల్లిపేస్టు: ఒక కప్పు,
కొత్తిమీర తురుము: ఒక కప్పు,
అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు టీస్పూన్లు,
కోడిగుడ్లు: రెండు,
గరంమసాలా: టీ స్పూను,
కారం: ఒక టీస్పూను,
పచ్చిమిర్చి: ఒకటి,
ఉప్పు: తగినంత,
బేకింగ్‌పౌడర్‌: పావు టీస్పూను,
జాపత్రి పొడి: చిటికెడు
తయారుచేసేవిధానం
కైమాలో టీస్పూను అల్లంవెల్లుల్లి ముద్ద కలిపి కొద్దిగా నీరు చల్లి, 15 నిమిషాలపాటు ఆవిరిమీద ఉడికించాలి. తరవాత అందులో జీడిపప్పు పొడి, కొబ్బరి పొడి, క్యారెట్‌ తురుము, ఉల్లిముద్ద, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి, మసాలా పొడి, జాపత్రి పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి లడ్డూలు మాదిరిగా ఉండలు చేయాలి.
గుడ్డులోని తెల్లసొనను బాగా బీట్‌ చేయాలి. మైదాలో కార్న్‌ఫ్లోర్‌, బీట్‌ చేసిన తెల్లసొన, ఉప్పు, బేకింగ్‌ పౌడర్‌ వేసి తగినన్ని నీళ్లు పోసి చిక్కని గుజ్జులా కలిపి కొద్దిసేపు నానబెట్టాలి.
నూనెలో నెయ్యి కలిపి వేడిచేయాలి. తరవాత మైదా మిశ్రమంలో ముంచిన కైమా ఉండల్ని దోర రంగులోకి వచ్చేవరకూ వేయించి తీస్తే కైమా కార్న్‌ ఫ్రైడ్‌బాల్స్‌ రెడీ.