కావలసిన పదార్దాలు :
పొటాటోస్ పెద్దవి: 2
బీట్‌రూట్ : 1
క్యారెట్ : 1
పచ్చిబఠాణి : 1/2 కప్పు
టమోటాలు : 2
పెద్ద ఉల్లిపాయ : 1
పచ్చిమిర్చి : 2
కొతిమీర : చిన్న కట్ట
కారం : 1 టీ స్పూన్
పసుపు : 1/4 టీ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్
నూని : 2 స్పూన్స్
ఆవాలు : 1టీ స్పూన్
జీరా : 1 టీ స్పూన్
ఎండుమిర్చి : 1
ఉప్పు : తగినంత
తయారుచేయు విధానం :
పొటాటో, క్యారెట్, బీట్‌రూట్‌లను పీలర్‌తో చెక్కుతీసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. పచ్చిబఠాణి కూడా విడిగా ఉడకబెట్టి వీటిని పక్కన పెట్టండి. ఇప్పుడు పెద్దౌల్లిపాయను, పచ్చిమిర్చి, టమోటాలను సన్నగా తరిగాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనేవేసి వేడెక్కిన తరువాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకులతో తాలింపు పెట్టి దానిలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగిన తరువాత టమోటా ముక్కలను కూడా చేర్చి మరో ఐదు నిమిషాలు వేయించి దానిలో అల్లం పేస్ట్, కారం, పసుపు వేసి ఒక నిముషం వేయించాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన దుంపముక్కలను, పచ్చిబఠాణిలు వేసి బాగా కలియదిప్పి ఒక అరగ్లాసు నీరుపోసి సన్నని మంటమీద ఉడకనివ్వాలి మనకు సరిపడ గ్రేవీ వచ్చే వరకు ఉడకనిచ్చి ఉప్పు సరిచూసుకుని, కొత్తిమీర సన్నగా తరిగి వేసి దించేయాలి. మషాల కావాలనుకుంటే వెజ్ మసాలా కొద్దిగా వేసుకోవచ్చు.
ఈ కర్రి రైస్‌లోకి, చపాతిలోకి కూడా బాగుంటుంది.
No comments:
Post a Comment