కావలసినవి
చికెన్ లెగ్: ఒకటి, ఉప్పు: తగినంత, నిమ్మకాయ: అరచెక్క, అల్లంవెల్లుల్లి ముద్ద: టీస్పూను, గట్టిపెరుగు: అరకప్పు, గరంమసాలా: అరటీస్పూను, మిరియాలపొడి: పావుటీస్పూను, కారం: పావుటీస్పూను, రెడ్‌ఆరెంజ్‌కలర్: చిటికెడు, కొత్తిమీర, పుదీనా ఆకుల ముద్ద: టీస్పూను, నూనె: 4 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* చికెన్ లెగ్‌కు చాకుతో గాట్లు పెట్టి ఉప్పు, నిమ్మరసం అద్ది నానబెట్టాలి.
* ఓ గిన్నెలో పెరుగు వేసి అందులో గరంమసాలా, మిరియాలపొడి, కారం, ఆరెంజ్ కలర్, పుదీనా కొత్తిమీర ముద్ద కలిపి తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి చికెన్ లెగ్‌కి పట్టించాలి. దీన్ని అరగంటసేపు నానబెట్టాలి.
* ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్ తీసుకుని దానిమీద చికెన్ లెగ్ పెట్టి మసాలా కూడా దానిమీద పోసి మూతపెట్టాలి.
* సన్నని మంటమీద 10 నిమిషాలు ఒకవైపు 10 నిమిషాలు మరోవైపు ఉంచి వేయించాలి. పూర్తిగా వేగిన తరవాత దించి పుదీనా చట్నీ లేదా ఏదైనా సాస్‌తో తింటే బాగుంటుంది.
No comments:
Post a Comment