మటన్: కిలో(ముక్కలుగా కోయాలి), బాస్మతిబియ్యం: అరకిలో, ఉల్లిపాయలు: నాలుగు(సన్నగా ముక్కలుగా కోయాలి), అల్లంవెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు, కారం: 2 టీస్పూన్లు, కొత్తిమీర: కట్ట(సన్నగా తురమాలి), పుదీనా: చిన్న కట్ట, పచ్చిమిర్చి: 4(పొడవుగా కోయాలి), పెరుగు: 2 కప్పులు, పాలు: అరకప్పు, కుంకుమపువ్వు: చిటికెడు, నిమ్మకాయలు: 2, యాలకులు: ఆరు, లవంగాలు: 8, దాల్చినచెక్క: అంగుళం ముక్క, నూనె: ముప్పావుకప్పు, నెయ్యి: 2టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత
మటన్ ముక్కలకు పట్టించేందుకు: యాలకులు: నాలుగు, లవంగాలు: ఆరు, దాల్చినచెక్క: అంగుళం ముక్క, షాజీరా: టీస్పూను, మిరియాలు: అరటీస్పూను తయారుచేసే విధానం
1 మటన్ ముక్కల్ని శుభ్రంగా కడగాలి.
2 బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి పక్కన ఉంచాలి.
3 మటన్‌ముక్కలకు అల్లంవెల్లుల్లి, ఉప్పు, కారం, సగం కొత్తిమీర, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, నిమ్మరసం, మసాలదినుసులు, వేయించిన ఉల్లిముక్కలు అన్నీ పట్టించి ఓ రెండుగంటలు నాననివ్వాలి.
4 పాలల్లో కుంకుమపువ్వు వేసి నాననివ్వాలి.
5 మందపాటి పాన్ తీసుకుని మటన్ ముక్కలన్నీ వేసి తక్కువ మంటమీద 6డికించాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి.
7 అవి ఉడుకుతుండగానే బియ్యం కడిగి ఉంచాలి. విడిగా మరో మందపాటి గిన్నెలో 8 గ్లాసుల నీళ్లు పోసి అవి మరిగిన తరవాత యాలకులు, లవంగాలు, పలావు ఆకులు, దాల్చినచెక్క, కొద్దిగా ఉప్పు వేసి బియ్యం వేయాలి. అన్నం మూడువంతులు ఉడికాక నీళ్లు వంపేసి అన్నాన్ని వెడల్పాటి బేసిన్‌లో పొడిపొడిలాడుతున్నట్లుగా ఆరనివ్వాలి.
8 ఇప్పుడు మందపాటి పాత్ర లేదా ప్రెషర్‌పాన్ తీసుకుని అడుగున నెయ్యి రాసి సగం అన్నాన్ని అడుగున పరచాలి. దానిమీద ఉడికించిన మాంసం ముక్కల్ని ఒక పొరలా పేర్చాలి.ఈ ముక్కల్ని మిగిలిన అన్నంతో కప్పేయాలి. కుంకుమపువ్వు కలిపిన పాలను అన్నంమీద చిలకరించాలి. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ముక్కల్ని పైపైన చల్లి నెయ్యి వేయాలి. మూతపెట్టి తక్కువ మంటమీద అన్నం పూర్తిగా ఉడికేవరకూ ఉంచాలి. అన్నం ఉడికి మంచి వాసన వస్తుండగా దించి వెుత్తం కలపకుండా నెమ్మదిగా ముక్కల్నీ అన్నాన్నీ తీస్తూ వడ్డించాలి.

No comments:
Post a Comment