కావలసినవి
మటన్ కైమా: అరకేజీ,
నీళ్లు: తగినన్ని,
రిఫైండాయిల్: తగినంత,
నెయ్యి:50గ్రా||,
మైదా: 200గ్రా||,
కార్న్‌ఫ్లోర్: 100గ్రా||,
జీడిపప్పు పొడి: ఒక కప్పు,
ఎండుకొబ్బరి పొడి: ఒక కప్పు,
క్యారెట్ తురుము: ఒక కప్పు,
ఉల్లిపేస్టు: ఒక కప్పు,
కొత్తిమీర తురుము: ఒక కప్పు,
అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు టీస్పూన్లు,
కోడిగుడ్లు: రెండు,
గరంమసాలా: టీ స్పూను,
కారం: ఒక టీస్పూను,
పచ్చిమిర్చి: ఒకటి,
ఉప్పు: తగినంత,
బేకింగ్‌పౌడర్: పావు టీస్పూను,
జాపత్రి పొడి: చిటికెడు
తయారుచేసేవిధానం
కైమాలో టీస్పూను అల్లంవెల్లుల్లి ముద్ద కలిపి కొద్దిగా నీరు చల్లి, 15 నిమిషాలపాటు ఆవిరిమీద ఉడికించాలి. తరవాత అందులో జీడిపప్పు పొడి, కొబ్బరి పొడి, క్యారెట్ తురుము, ఉల్లిముద్ద, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి, మసాలా పొడి, జాపత్రి పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి లడ్డూలు మాదిరిగా ఉండలు చేయాలి.
గుడ్డులోని తెల్లసొనను బాగా బీట్ చేయాలి. మైదాలో కార్న్‌ఫ్లోర్, బీట్ చేసిన తెల్లసొన, ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి తగినన్ని నీళ్లు పోసి చిక్కని గుజ్జులా కలిపి కొద్దిసేపు నానబెట్టాలి.
నూనెలో నెయ్యి కలిపి వేడిచేయాలి. తరవాత మైదా మిశ్రమంలో ముంచిన కైమా ఉండల్ని దోర రంగులోకి వచ్చేవరకూ వేయించి తీస్తే కైమా కార్న్ ఫ్రైడ్‌బాల్స్ రెడీ.
No comments:
Post a Comment