కావలసినవిరొయ్యలు(పెద్ద సైజువి): అరకిలో, రిఫైండ్ ఆయిల్: తగినంత, నీళ్లు: 2 కప్పులు, కార్న్‌ఫ్లోర్: 2 టీస్పూన్లు, మైదా: టీస్పూను, కోడిగుడ్డు: ఒకటి, ఉల్లికాడల తురుము: కప్పు, కొత్తిమీర తురుము: అరకప్పు, క్యారెట్ తురుము: అరకప్పు, బీన్స్(సన్నగా తరగాలి): అరకప్పు, పచ్చిమిర్చి: 4(సన్నముక్కలుగా కోయాలి), టొమాటో కెచప్: 2 టేబుల్‌స్పూన్లు, అల్లం-వెల్లుల్లి ముద్ద: టీస్పూను, గ్రీన్ చిల్లీ సాస్: టీస్పూను, కారం: అరటీస్పూను, మిరియాలపొడి: పావుటీస్పూను, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం: ఓ గిన్నెలో శుభ్రం చేసిన రొయ్యలు వేసి కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్, మైదా, అల్లం-వెల్లుల్లి ముద్ద, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి అవరసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి మిశ్రమం రొయ్యలకు పట్టేలా కలపాలి. ఇప్పుడు వీటిని నూనెలో పకోడీల మాదిరిగా దోరగా వేయించి తీయాలి.
సన్నగా తరిగిన క్యారెట్, బీన్స్ ముక్కల్ని సగం ఉడికించి చల్లార్చాలి.
కళాయిలో 2 టేబుల్‌స్పూన్లు నూనె పోసి కాగాక ఉల్లికాడలు, పచ్చిమిర్చి తురుముల్ని వేసి దోరగా వేయించాలి. తరవాత గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో కెచప్, కారం, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. 2 కప్పుల నీళ్ళు పోసి వేయించిన రొయ్యల్ని వేయాలి. కొత్తిమీర తురుము, క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి మీడియం సెగమీద వేయించి దించాలి.
Great Recipe I really like this type of sea Food....
ReplyDeleteThanks for share.......
Andhra Recipes