జనపాయ మసాలా వేపుడు |
కావలసినవి ఉడికించిన జనపాయ ముక్కలు: అరకేజీ, మంచినీళ్ళు: రెండు కప్పులు, నూనె: 100గ్రా||, ఉల్లికాడల తురుము: ఒక కప్పు, టొమాటో ముక్కలు: కప్పు, కొత్తిమీర తురుము: అర కప్పు, పచ్చిమిర్చి: మూడు, కారం: టీస్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద: టీస్పూను, పసుపు: పావు టీస్పూను, మసాలాపొడి: టీస్పూను, జీడిపప్పు పేస్ట్: ఒక టీస్పూను, గసగసాల ముద్ద: ఒక టీస్పూను, పచ్చికొబ్బరితురుము: ఒక టీస్పూను, పుదీనా తురుము: రెండు స్పూన్లు, ఉప్పు: తగినంత |
తయారుచేసేవిధానం కళాయిలో నూనె వేసి అది కాగగానే ఉల్లికాడ తురుము, అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా వేసి సువాసన వచ్చేవరకూ వేయించాలి. ఉప్పు, కారం, పసుపు, మసాలాపొడి, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. నూరుకున్న గసాలు, జీడిపప్పు ముద్దలు కూడా వేసి, మంచినీళ్లు పోసి కలపాలి. చేపగుడ్లముక్కలు వేసి కళాయిలోని ముక్కలన్నీ కలిసేలా ఓసారి ఎత్తి కుదపాలి. మూతపెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చి కొత్తిమీర చల్లి దించాలి. దీన్ని అన్నంలోనూ బ్రెడ్‌లోనూ కూడా వేడిగా తింటే బాగుంటుంది. |
Saturday, October 31, 2009
జనపాయ మసాలా వేపుడు
Labels:
జనపాయ మసాలా వేపుడు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment