కావలసినవి
బంగాళాదుంపలు: పావుకిలో, నిమ్మకాయ: ఒకటి, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: అరటీస్పూను, చిజ్: 150గ్రా., మీగడ: 50 మి.లీ., కోడిగుడ్డు: ఒకటి, బ్రెడ్‌పొడి: అరకప్పు, నూనె: వేయించడానికి సరిపడా. తయారుచేసే విధానం బంగాళాదుంపల్ని మెత్తగా ఉడికించి పొట్టు తీసి చల్లారిన తరవాత మెత్తగా చిదిమి ముద్దలా చేయాలి. ఈ ముద్దలో ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి ఉంచాలి. చీజ్‌ను తురిమి అందులో మీగడ కలిపి ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండకూ బంగాళాదుంప మిశ్రమాన్ని అద్దుతూ గుండ్రని బంతుల్లా చేయాలి. కోడిగుడ్డుని పగులగొట్టి సొన గిలకొట్టాలి. ఇప్పుడు ఈ ఉండల్ని సొనలో ముంచి బ్రెడ్‌పొడిలో దొర్లించి నూనెలో వేయించి తీయాలి. వేడివేడిగా తింటే బాగుంటాయి.

No comments:
Post a Comment