Sunday, January 25, 2009

టైగర్‌ రొయ్యల కూర

కడుపు నింపుకోవడానికి ఏది తింటేనేం, అది ఎలా ఉంటేనేం... అనుకునేవాళ్లు రకరకాల రుచుల జోలికిపోకుండా ఏదో తమకు తెలిసిన నాలుగైదు రకాలతోనే సరిపెట్టుకుంటారు. కానీ కొత్తకొత్త రుచుల్ని ఆస్వాదించాలనుకునే భోజనప్రియులెందరో.. అలాంటివారి కోసమే ఈ వారం కొన్ని కన్నడ స్పెషల్స్‌...
కావలసినవి: రొయ్యలు: మూడుకేజీలు, ఉల్లిపాయలు: అరకేజి, నెయ్యి: 50గ్రా||, నిమ్మరసం: మూడుస్పూన్లు, ఉప్పు: తగినంత
మసాలాకోసం: కొత్తిమీర: రెండుకట్టలు, పచ్చిమిరపకాయలు: 30గ్రా||, ఎండుమిర్చి: పదిహేను, అల్లం: 25గ్రా||, వెల్లుల్లి: 25గ్రా||, లవంగాలు: పదిహేను, దాల్చినచెక్క: ఆరు ముక్కలు, యాలకులు: పది, గసగసాలు: ఐదుస్పూన్లు, దనియాలు: 50గ్రా||
తయారుచేసేవిధానం: రొయ్యల్ని ఒలిచి శుభ్రంగా కడగాలి. రెండుమూడు ఉల్లిపాయల్ని చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. మిగిలినవాటిని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ ముద్దలా రుబ్బుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి, ఉల్లిపాయ ముక్కల్ని గోధుమరంగులోకి వచ్చేవరకూ వేయించాలి. రొయ్యల్ని ఐదు నిమిషాలు వేయించిన తరవాత ఉల్లి, మసాలా ముద్ద కూడా వేసి బాగా వేయించాలి. ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించాలి. కూర దగ్గరగా ఉడికిన తరవాత నిమ్మరసం పిండి, ఐదునిమిషాలు సిమ్‌లో పెట్టి దించాలి.

చిట్కా
రొయ్యల్ని శుభ్రంగా కడిగిన తరవాత కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి పదీ పదిహేను నిమిషాలు ఉంచితే రొయ్యల వాసన పోవడమే కాదు, కూర కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్క రొయ్యలకే కాదు, సీఫుడ్‌ దేనికైనా ఈ చిట్కా వర్తిస్తుంది.

No comments:

Post a Comment