కావలసినవి :
చికెన్ : అరకేజి
పెరుగు : 3 టేబుల్ స్పూన్స్
పెద్ద టమోట : 1
పెద్ద ఉల్లిపాయలు : 2
అల్లం, వెల్లుల్లి పెస్ట్ : 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి : 1 టేబుల్ స్పూన్
నల్ల మిరియాల పొడి : 1 టేబుల్ స్పూన్
సోంపు పౌడర్ : 1/4 టి స్పూన్
కొతిమీర : 1 కట్ట
కారం : 1 టీ స్పూన్
పసుపు : కొద్దిగ
సాల్ట్ : సరిపడ
మసాల పేస్ట్
నూని : 5 స్పూన్స్
జీడిపప్పు : 7
పాలు : పావు కప్పు
్‌పొడి మసాల : 1 టేబుల్ స్పూన్
్‌దాల్చిన చెక్క : చిన్న ముక్క
లవంగాయలు : 3
కరివేపాకు: 10 రెమ్మలు
తయారు చేయు విధానం : చికెన్ కడిగి ఉప్పు, కారం, పసుపు, పెరుగు పట్టించి ఒక అరగంట పక్కన పెట్టాలి.
జీడిపప్పుని పాలతో పేస్ట్ చేయాలి. దీన్ని కూడ చికెన్‌కి కలపాలి.
ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేడి అయిన తరువాత దాల్చిన, లవంగాయలు, కరివేపాకు వేసి వెంటనే ఉల్లపాయలను సన్నగా తరిగి దొరగా వేయించి, సోంపు పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పడు సన్నగా తరిగిన టమోటా ముక్కల్ని వేసి అయిదు నిమిషాలు వేయించాలి దీనిలో ముందుగా మనం కలిపి ఉంచుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి స్టవ్‌ని మీడియంలో ఉంచాలి. చికెన్‌లోని నీరు అంతా అయిపోయిన తరువాత మరి కాసిన నీరు పోసి ఒక పది నిమిషాలు సిమ్‌లో ఉంచి ఉప్పు సరిచూసుకుని పొడి మసాల, కొతిమీర సన్నగా తరిగివేసి ఒకసారి కలియబెట్టి దించేయాలి.
No comments:
Post a Comment