Monday, January 26, 2009

ఆకుకూరకాడలతో.



కావలసినవితోటకూరకాడలు (తరిగినవి) - ఒక కప్పుబచ్చలికూర కాడలు(తరిగినవి) - ఒక కప్పు
చుక్కకూర కాడలు (తరిగినవి) - ఒక కప్పుకొబ్బరి తురుము - అరకప్పు
టమాటాలు, ఉల్లిపాయలు (తరగాలి) -రెండు,రెండు
తాలింపు గింజలు - ఒక చెంచాఅల్లం, పచ్చిమిర్చి పేస్టు - 1 1/2 చెంచా
పెసరపప్పు - 3 చెంచాలు పసుపు - 1/4 చెంచా ఉప్పు తగినంత, నూనె తగినంత, కరివేపాకు- 1 రెమ్మ, ఎండుమిర్చి - 2 ధనియాల పొడి - ఒక చెంచా
తయారు చేసే విధానం
ముందుగా స్టౌమీద మూకుడు పెట్టి నూనె వేడి చేయాలి. తాలింపు గింజలు వేసి, వేగిన తరువాతఎండు మిరపకాయలు వేసుకోవాలి. అవి వేగిన తరువాత ఉల్లి గడ్డ ముక్కలు, పచ్చిమిర పకాయ, అల్లం పేస్టు వేసి వేయించాలి. తరువాత కాడలు వేసి, పసుపు, కరి వేపాకు, నానబెట్టిన పెసర పప్పు కూడా వేసుకో వాలి. అవి కాస్త మగ్గిన తరువాత కొబ్బరితురుము, ఉప్పు, టమాటాలు, ధని యాల పొడి వేసి మరి కాసేపు ఉడికించి దించాలి. ఈ కూర వేడి వేడిగా అన్నం లోకి గానీ, చపాతీలకు గానీ తినవచ్చు.

Sunday, January 25, 2009

పచ్చిమామిడికాయ మసాలా

కావలసినవి: మామిడికాయలు: ఒక కేజీ, దనియాలు: ఐదారుస్పూన్లు, మినప్పప్పు: ఐదారు స్పూన్లు, మెంతులు: టీస్పూను, కారం: టీస్పూను, బెల్లం: 50గ్రా||, మంచినీళ్లు: అరకప్పు, వెల్లుల్లి: 10గ్రా||, ఆవాలు: టీస్పూను, ఎండుమిర్చి: 15గ్రా||, కరివేపాకు: మూడు రెమ్మలు, తెల్లనువ్వులు: టీస్పూను, బియ్యం: టీస్పూను, రిఫైండ్‌ ఆయిల్‌: 30 మిల్లీలీటర్లు, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: తగినంత
తయారు చేసేవిధానం: దనియాలు, ఆవాలు, ఎండుమిర్చి, నువ్వులు, బియ్యం, మెంతులు... అన్నీ కొద్దిసేపు ఎండలోపెట్టి పొడి కొట్టుకోవాలి. మామిడికాయల్ని కడిగి పెద్దపెద్ద ముక్కలుగా కోయాలి.
మట్టికుండలో కొద్దిగా నూనె పోసి చిదిమిన వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చితో పోపు పెట్టి అందులో మామిడికాయ ముక్కలు వేసి గరిటెతో కలపాలి. ముందే తయారుచేసి పెట్టుకున్న మసాలా పొడి, కారం, బెల్లం, కొద్దిగా మంచినీళ్లు పోసి ఉడికించి దించాలి. దించే ముందు కొత్తిమీర చల్లితే మసాలా మామిడి కూర రెడీ!

పత్రొడె

కావలసినవి: చేమదుంప ఆకులు: 20, బియ్యం: పావుకేజి, కందిపప్పు: 100గ్రా||, కొబ్బరి తురుము: 50గ్రా||, ఎండుమిర్చి: 25గ్రా||, చింతపండు: 25గ్రా||, పసుపు: చిటికెడు, ఉప్పు: తగినంత, తురిమిన బెల్లం: 25గ్రా||, నూనె: వేయించడానికి సరిపడా, ఆవాలు: టీస్పూను, ఇంగువ: చిటికెడు
తయారుచేసేవిధానం: ముందుగా బియ్యాన్నీ కందిపప్పునీ మూడు నాలుగు గంటలు నానబెట్టాలి. చేమదుంపల ఆకుల్ని బాగా కడిగి పెట్టుకోవాలి. బియ్యం, కందిపప్పు, ఎండుమిర్చి, చింతపండు... అన్నింటినీ మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా పసుపు, ఇంగువ, ఉప్పు, బెల్లం ఈ మిశ్రమంలో కలపాలి. చేమదుంప ఆకుల్లోని దళసరి భాగాల్ని కత్తిరించి ప్లేటులో పరవాలి. పిండిమిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరసెంటీమీటరు మందాన ఒక్కో ఆకుమీదా పరవాలి. ఆకు అంచుల్ని అన్నివైపులా లోపలకి మడవాలి. ఇప్పుడు ఆకు మొత్తాన్ని ఓ పక్క నుంచి మరో పక్కకు చుట్టుకుంటూ వెళ్లాలి. ఇలా అన్ని ఆకులూ చుట్టిన తరవాత ఇడ్లీకుక్కర్‌లో అరగంటసేపు ఉడికించి దించాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె పోసి, ఉడికించిన ఆకుల్ని వేయించి తీస్తే పత్రొడె తయార్‌!

టైగర్‌ రొయ్యల కూర

కడుపు నింపుకోవడానికి ఏది తింటేనేం, అది ఎలా ఉంటేనేం... అనుకునేవాళ్లు రకరకాల రుచుల జోలికిపోకుండా ఏదో తమకు తెలిసిన నాలుగైదు రకాలతోనే సరిపెట్టుకుంటారు. కానీ కొత్తకొత్త రుచుల్ని ఆస్వాదించాలనుకునే భోజనప్రియులెందరో.. అలాంటివారి కోసమే ఈ వారం కొన్ని కన్నడ స్పెషల్స్‌...
కావలసినవి: రొయ్యలు: మూడుకేజీలు, ఉల్లిపాయలు: అరకేజి, నెయ్యి: 50గ్రా||, నిమ్మరసం: మూడుస్పూన్లు, ఉప్పు: తగినంత
మసాలాకోసం: కొత్తిమీర: రెండుకట్టలు, పచ్చిమిరపకాయలు: 30గ్రా||, ఎండుమిర్చి: పదిహేను, అల్లం: 25గ్రా||, వెల్లుల్లి: 25గ్రా||, లవంగాలు: పదిహేను, దాల్చినచెక్క: ఆరు ముక్కలు, యాలకులు: పది, గసగసాలు: ఐదుస్పూన్లు, దనియాలు: 50గ్రా||
తయారుచేసేవిధానం: రొయ్యల్ని ఒలిచి శుభ్రంగా కడగాలి. రెండుమూడు ఉల్లిపాయల్ని చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. మిగిలినవాటిని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ ముద్దలా రుబ్బుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి, ఉల్లిపాయ ముక్కల్ని గోధుమరంగులోకి వచ్చేవరకూ వేయించాలి. రొయ్యల్ని ఐదు నిమిషాలు వేయించిన తరవాత ఉల్లి, మసాలా ముద్ద కూడా వేసి బాగా వేయించాలి. ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించాలి. కూర దగ్గరగా ఉడికిన తరవాత నిమ్మరసం పిండి, ఐదునిమిషాలు సిమ్‌లో పెట్టి దించాలి.

చిట్కా
రొయ్యల్ని శుభ్రంగా కడిగిన తరవాత కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి పదీ పదిహేను నిమిషాలు ఉంచితే రొయ్యల వాసన పోవడమే కాదు, కూర కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్క రొయ్యలకే కాదు, సీఫుడ్‌ దేనికైనా ఈ చిట్కా వర్తిస్తుంది.

కోడికూర విజయవాడ ప్రాంతంవాలది

నాన్‌వెజ్‌ ప్రియులకు కోడికూర అనగానే నోరూరుతుంది. ఎంత చికెన్‌ ప్రియులకైనా ఎప్పుడూ ఒకే రకమైన కూర తింటే మొహం మొత్తుతుంది. చిన్నపాటి మార్పులతో కోడికూరను రకరకాలుగా చేసుకుంటే పిల్లలూ పెద్దలూ ఇష్టంగా తింటారు.అందుకే ఈవారం కొన్ని చికెన్‌ వంటకాలు...కావలసినవి
ఎముకలున్న బ్రాయిలర్‌ చికెన్‌: అరకేజీ, నీళ్లు: అరలీటరు, నూనె: 100గ్రా||, దేశవాళీ టొమాటో ముక్కలు: కప్పు, ఉల్లిపాయ తురుము: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, పెరుగు: కప్పు, కొత్తిమీర తురుము: అరకప్పు, పచ్చికొబ్బరి ముద్ద: అరకప్పు, గసాల ముద్ద: అరకప్పు, అల్లంవెల్లుల్లిముద్ద: రెండు టీస్పూన్లు, ఆంధ్రా మసాలాపొడి: రెండు టీస్పూన్లు, కారం: రెండు టీస్పూన్లు, పసుపు: పావు టీస్పూను, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
చికెన్‌ బాగా కడిగి ఉప్పు, కారం, పెరుగు, పసుపు, మసాలాపొడి, సగం అల్లంవెల్లుల్లి ముద్ద ముక్కలకు బాగా పట్టించి అరగంటసేపు నాననివ్వాలి.
కళాయిలో నూనె పోసి కాగిన తరవాత ఉల్లి తురుము వేసి దోరగా వేయించి మిగతా సగం అల్లంవెల్లుల్లి ముద్ద కూడా వేసి సువాసన వచ్చేవరకూ వేయించాలి. తరవాత చికెన్‌ముక్కల మిశ్రమాన్ని కూడా వేసి మరీ సన్నటి సెగ కాకుండా మీడియం సెగమీద ముక్కల్ని కలుపుతూ మగ్గనివ్వాలి. తరవాత సన్నగా చీరిన పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు కూడా వేసి కొద్దిగా ఎసరు పోసి ముక్కల్ని బాగా ఉడికించాలి. తరవాత పచ్చికొబ్బరి, గసాల ముద్దలు వేసి కొద్దిసేపు ఉడికించి చివరలో కొత్తిమీర చల్లి దించాలి.
ఇండియన్‌ సోరెల్‌
కావలసినవి
బ్రాయిలర్‌ చికెన్‌:అరకేజీ, నీళ్లు: అరలీటరు, చింతచిగురు: రెండు కప్పులు లేదా చింతచిగురు పొడి: కప్పు, ఉల్లి తురుము: కప్పు, కొత్తిమీర తురుము: అరకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, కారం: రెండు టీస్పూన్లు, ఆంధ్రామసాలా పొడి: టీస్పూను, పసుపు: పావు టీస్పూను, కొబ్బరిముద్ద: టీస్పూను, గసాలముద్ద: టీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: 100గ్రా||
తయారుచేసే విధానం
చికెన్‌ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం, మసాలాపొడి, కొబ్బరి, గసాలముద్ద, కొత్తిమీర తురుము అన్నింటినీ ముక్కలకు బాగా పట్టించాలి. కుక్కర్‌గిన్నెలో నూనె పోసి కాగిన తరవాత, ఉల్లితురుము, అల్లంవెల్లుల్లి వేసి దోరగా వేయించి చికెన్‌ మిశ్రమం కూడా వేసి సన్నటి సెగమీద ఉడికించాలి. ముక్కలు కొద్దిగా ఉడికిన తరవాత సన్నగా చీరిన పచ్చిమిర్చి, చింతచిగురు వేసి నీళ్లుపోసి 15 నిమిషాలపాటు ఉడికించి దించాలి. చికెన్‌లో ఉండే ప్రోటీన్స్‌కు చింతచిగురు తోడయితే పుల్లపుల్లగా రుచికరంగా ఉండటంతోపాటు జీర్ణశక్తి బాగుంటుంది. ఎక్కువగా దొరికే కాలంలో చింతచిగురును శుభ్రంచేసి, రెండు రోజలు ఆరబెట్టి మూడోరోజు ఎండలోపెట్టి పొడి కొట్టి, ఉప్పు కలిపి నిల్వ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు వంటల్లో వాడుకోవచ్చు.
ఆంధ్రా చికెన్‌
కావలసినవి
ఎముకల్లేని చికెన్‌ముక్కలు(మెత్తనివి): అరకేజీ, నీళ్లు: అరలీటరు, దేశవాళీ టొమాటో గుజ్జు: పెద్దకప్పు, ఆరెంజ్‌ రెడ్‌ కలర్‌: పావు టీస్పూను, రిఫైండాయిల్‌: 100గ్రా||, ఉల్లిముద్ద: కప్పు, కొత్తిమీర తురుము: అరకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: రెబ్బ, అల్లంవెల్లుల్లిముద్ద: టేబుల్‌స్పూను, కొబ్బరిముద్ద: టేబుల్‌స్పూను, గసాలముద్ద: టేబుల్‌స్పూన్‌, ఆంధ్రామసాలా పొడి: ఒక టేబుల్‌స్పూను, కారం: స్పూను, పసుపు: పావు టీస్పూను, మిరియాల పొడి: పావు టీస్పూను, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
చికెన్‌ముక్కల్ని శుభ్రంగా కడిగి అల్లంవెల్లుల్లి, ఉప్పు, పసుపు పట్టించి కాసేపు నాననిచ్చి,కుక్కర్‌లో కొద్దిగా నీళ్లుపోసి 15 నిమిషాలు ఉడికించాలి.
కళాయిలో నూనెపోసి సన్నగా చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి తీసి వేరుగా ఉంచండి. అదే కళాయిలో ఉల్లిముద్ద దోరగా వేయించి మిగిలిన అల్లంవెల్లుల్లి కూడా వేసి వేయించాలి. మసాలాపొడి, ఉప్పు, కారం, కొబ్బరిముద్ద, గసాల ముద్ద, మిరియాలపొడి అన్నీ వేసి బాగా కలిపి టొమాటో గుజ్జు కూడా వేసి తిప్పాలి. చికెన్‌ముక్కలు, కొద్దిగా ఫుడ్‌ కలర్‌ వేసి సన్నటి సెగమీద ఉడికించాలి. ముక్కలు వేగిన తరవాత కొత్తిమీర తురుము, వేయించి ఉంచిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి దించితే తక్కాలీ ఆంధ్రా చికెన్‌ రెడీ!

కఢాయీ కా గోస్ట్‌

కావలసినవి
మాంసం: అరకేజీ,
ఉల్లిపాయలు: మూడు(రెండు చిన్నముక్కలుగా తరగాలి, ఒకటి నూరాలి),
అల్లంవెల్లుల్లి ముద్ద: టీస్పూను,
పచ్చిమిరపకాయలు: ఎనిమిది, (మెత్తగా నూరుకోవాలి),
పసుపు: పావు టీస్పూను,
పెరుగు: టీస్పూను,
గరం మసాలా: అర టీస్పూను,
నిమ్మకాయలు: రెండు,
ఉప్పు: సరిపడా,
నూనె: కప్పులో మూడో వంతు
తయారుచేసేవిధానం
ప్రెజర్‌ పాన్‌లో నూనె వేయాలి. కాగిన తరవాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకూ వేయించాలి. నూరిన ఉల్లిముద్దనీ అల్లంవెల్లుల్లి ముద్దనీ వేసి కొద్దిగా వేయించాలి. నూరిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి. మాంసం ముక్కలు కూడా వేసి వేయించాలి. అవి వేగాక సరిపడా నీళ్లు పోసి ముక్కలు ఉడికించాలి. రెండు మూడు స్పూన్ల పెరుగు కూడా వేసి తక్కువ మంటమీద మరో ఐదునిమిషాలు ఉడికించాలి. దించేముందు గరంమసాలా పొడి కూడా కలిపి, దించిన తరవాత నిమ్మరసం కలుపుకోవాలి.

కరైకుడి కరిచాప్స్‌(మటప్‌ చాప్స్‌)

కావలసినవి
మటన్‌ ముక్కలు: మూడు కేజీలు,
ఉల్లిపాయలు: పావుకేజీ,
టొమాటోలు: పావుకేజీ,
అల్లంవెల్లుల్లిముద్ద: 50గ్రా||,
కారం: 12 టీస్పూన్లు,
దనియాలపొడి: ఎనిమిది టీస్పూన్లు,
పసుపు: రెండు స్పూన్లు,
నూనె: వేయించడానికి సరిపడా (సుమారు పావుకేజీ),
గరంమసాలా పొడి: రెండు టీస్పూన్లు,
కోడిగుడ్లు: ఎనిమిది,
కొత్తిమీర: ఒక కట్ట
తయారుచేసేవిధానం
ఉల్లిపాయలు, టొమాటోల్ని సన్నని ముక్కలుగా కోసుకోవాలి. అల్లంవెల్లుల్లి నూరుకోవాలి. కోడిగుడ్లన్నీ పగలగొట్టి సొనను ఓ పాత్రలోకి వంపాలి. అందులో పసుపు, తరిగిన కొత్తిమీర వేసి సొనను బాగా గిల కొట్టాలి.
కళాయిలో నూనె పోసి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరవాత కారం, పసుపు, దనియాల పొడి, టొమాటో ముక్కలు కూడా వేసి బాగా ఉడికించాలి. తరవాత మటన్‌ ముక్కలు వేసి అవి కాస్త ఉడికిన తరవాత కొద్దిగా నీళ్లు చిలకరించి అవి ఆవిరైపోయే వరకూ ఉడికించాలి. చివరగా ఉడికించిన మటన్‌ ముక్కల్ని గిలకొట్టిన సొనలో ముంచి నూనెలో పకోడీల మాదిరిగా వేయించాలి.

కైమా బేసన్‌ రోటీస్‌

కావలసినవి
మటన్‌ కైమా: అరకేజీ,
సెనగపిండి: అరకేజీ,
నీళ్లు: తగినన్ని,
రిఫైండాయిల్‌: తగినంత,
వెన్న: 100గ్రా||,
ఉల్లిముద్ద: కప్పు,
కొత్తిమీర తురుము: కప్పు,
పచ్చికొబ్బరి పేస్టు: కప్పు,
కోడిగుడ్లు: రెండు,
అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు టీస్పూన్లు,
కారం: రెండు టీస్పూన్లు,
పచ్చిమిర్చి పేస్టు: టీస్పూను,
గరంమసాలా పొడి: టీస్పూను,
ఉప్పు: తగినంత
తయారుచేసేవిధానం
కైమాను శుభ్రంగా కడిగి, అందులో ఒక స్పూను అల్లంవెల్లుల్లి ముద్ద కలిపి కొద్దిగా నీళ్లు చల్లి 15 నిమిషాల పాటు కుక్కర్‌లో ఉడికించాలి. గుడ్డులోని తెల్లసొనను బాగా గిలకొట్టాలి. కైమాలో సెనగపిండి, గిలకొట్టిన తెల్లసొన, వెన్న, ఉల్లిముద్ద, కొబ్బరి ముద్ద, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి పేస్టు, మిగిలిన అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, మసాలా పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి గట్టి ముద్దలా కలిపి ఓ గంటసేపు నానబెట్టాలి. తరవాత ఈ కైమా మిశ్రమాన్ని పెద్ద సైజు లడ్డూల మాదిరిగా చేసి పాలకవర్లమీద రొట్టెలుగా చేసి పెనంమీద కొద్దికొద్దిగా నూనె వేస్తూ రెండువైపులా దోరగా కాల్చాలి.
వీటిని వేడివేడిగా టొమాటో కెచప్‌, గ్రీన్‌ చిల్లీ సాస్‌లతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.

ఆల్మండ్‌ గులాబి ఫిర్ని

కావలసినవి
పాలు: ఒక లీటరు,
బియ్యం: ఒక కప్పు,
పంచదార: ఒక కప్పు,
బాదంపప్పు: పది,
యాలకుల పొడి: అర టీ స్పూను,
రోజ్‌ వాటర్‌: రెండు స్పూన్లు,
వెనీలా ఎసెన్స్‌: ఒకటి లేదా రెండు చుక్కలు,
గులాబిరేకులు: కొన్ని
తయారుచేసేవిధానం
బియ్యాన్ని ఒకరాత్రంతా నానబెట్టి ఉంచాలి. నానిన బియ్యంలో కొద్దిగా పాలు పోసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. తరవాత పాలని మరిగించాలి. ఇప్పుడు పేస్టులా చేసిన బియ్యాన్ని ఈ పాలలో వేసి సన్నమంట మీద ఉడికించాలి. పంచదార కూడా వేసి ఉండలు కట్టకుండా గరిటెతో కదుపుతూ ఉడికించాలి. ఇలా ఎనిమిది నిమిషాలు సన్న సెగ మీద ఉడికించిన తరవాత మిశ్రమం కస్టర్డ్‌ మాదిరిగా చిక్కగా తయారవుతుంది. దీన్ని ఇప్పుడు మంటమీద నుంచి దించి, ఒక చుక్క వెనీలా ఎస్సెన్స్‌, రెండు స్పూన్ల రోజ్‌వాటర్‌ కూడా కలిపి కప్పుల్లో పోసి వడ్డించండి.. చివరగా గులాబీరేకులు, బాదంపప్పులతో అలంకరిస్తే ఫిర్ని తయార్‌!

బొప్పాయి పులుసు


పల్లెల్లో బొప్పాయిచెట్టు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. పోషక విలువల పరంగా చూసినా బొప్పాయి కాయది అగ్రస్థానమే. అయితే పండిన తరవాతే ఎక్కువమంది వాటిని వినియోగిస్తారు. కానీ పచ్చి కాయలతో కూడా రకరకాల రుచికరమైన కూరల్ని తయారుచేసుకోవచ్చు...
కావలసినవి
కొద్దిగా పండిన బొప్పాయి: సగం ముక్క, మునక్కాయ: ఒకటి,
బెండకాయలు: మూడు,
బచ్చలి ఆకులు: ఎనిమిది,
కొత్తిమీర: ఒక కట్ట,
పచ్చిమిర్చి: నాలుగు,
బెల్లం: నిమ్మకాయంత,
చింతపండురసం: రెండు కప్పులు,
ఉప్పు: తగినంత,
పసుపు: చిటికెడు,
బియ్యప్పిండి లేదా సెనగపిండి: రెండు స్పూన్లు,
పోపుకోసం:
ఆవాలు: ఒక స్పూను,
మెంతులు: అరస్పూను,
ఎండుమిర్చి: రెండు,
నూనె: రెండు స్పూన్లు.
తయారుచేసేవిధానం
బొప్పాయి చెక్కు తీసి పెద్దపెద్ద ముక్కలుగా కోయాలి. బెండకాయలు, మునగకాయ కూడా ముక్కలుగా కోసుకోవాలి. బచ్చలి ఆకు సన్నగా కోయాలి. పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఓ గిన్నెలో వేసి ముక్కలు మునిగేవరకూ నీళ్లు పోసి ఉప్పు, పసుపు కూడా వేసి కొద్దిగా ఉడికించాలి. తరవాత చింతపండు రసం, బెల్లం వేసి మరికాసేపు ఉడికించాలి. ముక్కలు ఉడికిన తరవాత అరకప్పు నీళ్లలో సెనగపిండిని ఉండలు కట్టకుండా కలిపి పులుసులో వేయాలి. పిండి వేసిన తరవాత ఐదు నిమిషాలు ఉడికించి దించి కొత్తిమీర సన్నగా తరిగి వేయాలి. ఇప్పుడు పులుసును తాలింపు వేస్తే సరి!