Sunday, January 25, 2009

కైమా బేసన్‌ రోటీస్‌

కావలసినవి
మటన్‌ కైమా: అరకేజీ,
సెనగపిండి: అరకేజీ,
నీళ్లు: తగినన్ని,
రిఫైండాయిల్‌: తగినంత,
వెన్న: 100గ్రా||,
ఉల్లిముద్ద: కప్పు,
కొత్తిమీర తురుము: కప్పు,
పచ్చికొబ్బరి పేస్టు: కప్పు,
కోడిగుడ్లు: రెండు,
అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు టీస్పూన్లు,
కారం: రెండు టీస్పూన్లు,
పచ్చిమిర్చి పేస్టు: టీస్పూను,
గరంమసాలా పొడి: టీస్పూను,
ఉప్పు: తగినంత
తయారుచేసేవిధానం
కైమాను శుభ్రంగా కడిగి, అందులో ఒక స్పూను అల్లంవెల్లుల్లి ముద్ద కలిపి కొద్దిగా నీళ్లు చల్లి 15 నిమిషాల పాటు కుక్కర్‌లో ఉడికించాలి. గుడ్డులోని తెల్లసొనను బాగా గిలకొట్టాలి. కైమాలో సెనగపిండి, గిలకొట్టిన తెల్లసొన, వెన్న, ఉల్లిముద్ద, కొబ్బరి ముద్ద, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి పేస్టు, మిగిలిన అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, మసాలా పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి గట్టి ముద్దలా కలిపి ఓ గంటసేపు నానబెట్టాలి. తరవాత ఈ కైమా మిశ్రమాన్ని పెద్ద సైజు లడ్డూల మాదిరిగా చేసి పాలకవర్లమీద రొట్టెలుగా చేసి పెనంమీద కొద్దికొద్దిగా నూనె వేస్తూ రెండువైపులా దోరగా కాల్చాలి.
వీటిని వేడివేడిగా టొమాటో కెచప్‌, గ్రీన్‌ చిల్లీ సాస్‌లతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.

No comments:

Post a Comment