కావలసినవి
మటన్ ముక్కలు: మూడు కేజీలు,
ఉల్లిపాయలు: పావుకేజీ,
టొమాటోలు: పావుకేజీ,
అల్లంవెల్లుల్లిముద్ద: 50గ్రా||,
కారం: 12 టీస్పూన్లు,
దనియాలపొడి: ఎనిమిది టీస్పూన్లు,
పసుపు: రెండు స్పూన్లు,
నూనె: వేయించడానికి సరిపడా (సుమారు పావుకేజీ),
గరంమసాలా పొడి: రెండు టీస్పూన్లు,
కోడిగుడ్లు: ఎనిమిది,
కొత్తిమీర: ఒక కట్ట
తయారుచేసేవిధానం
ఉల్లిపాయలు, టొమాటోల్ని సన్నని ముక్కలుగా కోసుకోవాలి. అల్లంవెల్లుల్లి నూరుకోవాలి. కోడిగుడ్లన్నీ పగలగొట్టి సొనను ఓ పాత్రలోకి వంపాలి. అందులో పసుపు, తరిగిన కొత్తిమీర వేసి సొనను బాగా గిల కొట్టాలి.
కళాయిలో నూనె పోసి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరవాత కారం, పసుపు, దనియాల పొడి, టొమాటో ముక్కలు కూడా వేసి బాగా ఉడికించాలి. తరవాత మటన్ ముక్కలు వేసి అవి కాస్త ఉడికిన తరవాత కొద్దిగా నీళ్లు చిలకరించి అవి ఆవిరైపోయే వరకూ ఉడికించాలి. చివరగా ఉడికించిన మటన్ ముక్కల్ని గిలకొట్టిన సొనలో ముంచి నూనెలో పకోడీల మాదిరిగా వేయించాలి.
No comments:
Post a Comment