కావలసినవి: మామిడికాయలు: ఒక కేజీ, దనియాలు: ఐదారుస్పూన్లు, మినప్పప్పు: ఐదారు స్పూన్లు, మెంతులు: టీస్పూను, కారం: టీస్పూను, బెల్లం: 50గ్రా||, మంచినీళ్లు: అరకప్పు, వెల్లుల్లి: 10గ్రా||, ఆవాలు: టీస్పూను, ఎండుమిర్చి: 15గ్రా||, కరివేపాకు: మూడు రెమ్మలు, తెల్లనువ్వులు: టీస్పూను, బియ్యం: టీస్పూను, రిఫైండ్ ఆయిల్: 30 మిల్లీలీటర్లు, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: తగినంత
తయారు చేసేవిధానం: దనియాలు, ఆవాలు, ఎండుమిర్చి, నువ్వులు, బియ్యం, మెంతులు... అన్నీ కొద్దిసేపు ఎండలోపెట్టి పొడి కొట్టుకోవాలి. మామిడికాయల్ని కడిగి పెద్దపెద్ద ముక్కలుగా కోయాలి.
మట్టికుండలో కొద్దిగా నూనె పోసి చిదిమిన వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చితో పోపు పెట్టి అందులో మామిడికాయ ముక్కలు వేసి గరిటెతో కలపాలి. ముందే తయారుచేసి పెట్టుకున్న మసాలా పొడి, కారం, బెల్లం, కొద్దిగా మంచినీళ్లు పోసి ఉడికించి దించాలి. దించే ముందు కొత్తిమీర చల్లితే మసాలా మామిడి కూర రెడీ!
No comments:
Post a Comment