కావలసినవి
పాలు: ఒక లీటరు,
బియ్యం: ఒక కప్పు,
పంచదార: ఒక కప్పు,
బాదంపప్పు: పది,
యాలకుల పొడి: అర టీ స్పూను,
రోజ్ వాటర్: రెండు స్పూన్లు,
వెనీలా ఎసెన్స్: ఒకటి లేదా రెండు చుక్కలు,
గులాబిరేకులు: కొన్ని
తయారుచేసేవిధానం
బియ్యాన్ని ఒకరాత్రంతా నానబెట్టి ఉంచాలి. నానిన బియ్యంలో కొద్దిగా పాలు పోసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. తరవాత పాలని మరిగించాలి. ఇప్పుడు పేస్టులా చేసిన బియ్యాన్ని ఈ పాలలో వేసి సన్నమంట మీద ఉడికించాలి. పంచదార కూడా వేసి ఉండలు కట్టకుండా గరిటెతో కదుపుతూ ఉడికించాలి. ఇలా ఎనిమిది నిమిషాలు సన్న సెగ మీద ఉడికించిన తరవాత మిశ్రమం కస్టర్డ్ మాదిరిగా చిక్కగా తయారవుతుంది. దీన్ని ఇప్పుడు మంటమీద నుంచి దించి, ఒక చుక్క వెనీలా ఎస్సెన్స్, రెండు స్పూన్ల రోజ్‌వాటర్ కూడా కలిపి కప్పుల్లో పోసి వడ్డించండి.. చివరగా గులాబీరేకులు, బాదంపప్పులతో అలంకరిస్తే ఫిర్ని తయార్!
No comments:
Post a Comment