Sunday, January 25, 2009

పత్రొడె

కావలసినవి: చేమదుంప ఆకులు: 20, బియ్యం: పావుకేజి, కందిపప్పు: 100గ్రా||, కొబ్బరి తురుము: 50గ్రా||, ఎండుమిర్చి: 25గ్రా||, చింతపండు: 25గ్రా||, పసుపు: చిటికెడు, ఉప్పు: తగినంత, తురిమిన బెల్లం: 25గ్రా||, నూనె: వేయించడానికి సరిపడా, ఆవాలు: టీస్పూను, ఇంగువ: చిటికెడు
తయారుచేసేవిధానం: ముందుగా బియ్యాన్నీ కందిపప్పునీ మూడు నాలుగు గంటలు నానబెట్టాలి. చేమదుంపల ఆకుల్ని బాగా కడిగి పెట్టుకోవాలి. బియ్యం, కందిపప్పు, ఎండుమిర్చి, చింతపండు... అన్నింటినీ మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా పసుపు, ఇంగువ, ఉప్పు, బెల్లం ఈ మిశ్రమంలో కలపాలి. చేమదుంప ఆకుల్లోని దళసరి భాగాల్ని కత్తిరించి ప్లేటులో పరవాలి. పిండిమిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరసెంటీమీటరు మందాన ఒక్కో ఆకుమీదా పరవాలి. ఆకు అంచుల్ని అన్నివైపులా లోపలకి మడవాలి. ఇప్పుడు ఆకు మొత్తాన్ని ఓ పక్క నుంచి మరో పక్కకు చుట్టుకుంటూ వెళ్లాలి. ఇలా అన్ని ఆకులూ చుట్టిన తరవాత ఇడ్లీకుక్కర్‌లో అరగంటసేపు ఉడికించి దించాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె పోసి, ఉడికించిన ఆకుల్ని వేయించి తీస్తే పత్రొడె తయార్‌!

No comments:

Post a Comment