Sunday, January 25, 2009

తొక్కు పడ్చడి

కావలసినవి
సొరకాయ: చిన్నముక్కతోపాటు కొంత సొరకాయ తొక్కు,
చింతపండు: నిమ్మకాయంత,
పసుపు: అర స్పూను,
ఉప్పు: తగినంత,
వెల్లుల్లిరేకలు: నాలుగు,
మినప్పప్పు: ఒక స్పూను,
ఆవాలు: అరస్పూను,
ఎండుమిర్చి: నాలుగు,
పచ్చిమిర్చి: నాలుగు,
పచ్చికొబ్బరి: చిన్నముక్క,
కరివేపాకు: ఒక రెమ్మ,
నూనె: నాలుగు టీ స్పూన్లు
తయారుచేసేవిధానం
ముందుగా తీసి ఉంచుకున్న సొరకాయ తొక్కునూ తొక్కుతో ఉన్న సొరకాయ ముక్కనూ చిన్నచిన్న ముక్కలుగా కోయాలి. ఇప్పుడు బాణలిలో రెండు స్పూన్లు నూనె పోసి ముందుగా పచ్చిమిర్చి వేయించి తీయాలి. తరవాత సొరకాయ ముక్కలు వేసి, ఉప్పు కూడా జల్లి మూతపెట్టాలి. తొక్కు బాగా ఉడికిన తరవాత కిందకు దించి చల్లార్చాలి. తరవాత చింతపండు, పసుపు, వెల్లుల్లి, కొబ్బరి, చల్లార్చిన సొరకాయ తొక్కు, ముక్కలు కూడా వేసి మెత్తగా రుబ్బాలి. రుబ్బిన ఈ పచ్చడిని చివరగా ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చిలతో తాలింపు వేస్తే కమ్మని సొరకాయ పచ్చడి రెడీ!

No comments:

Post a Comment