Sunday, January 25, 2009

కోఫ్తా

కావలసినవి
సొరకాయ: ఒకటి,
టొమాటోలు: పావుకేజీ,
ఉల్లిపాయలు: నాలుగు,
గరంమసాలా పొడి: రెండు స్పూన్లు,
కారం:ఓ స్పూను,
అల్లం: చిన్నముక్క,
వెల్లుల్లి: నాలుగు రేకలు,
పసుపు: ఒక స్పూను,
కొత్తిమీర: ఒక కట్ట,
సెనగపిండి: ఒక కప్పు,
నూనె: అరకిలో,
ఉప్పు: తగినంత
తయారుచేసేవిధానం
సొరకాయ తొక్కు తీసి సన్నగా తురమాలి. ఈ సొరకాయ తురుములో కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి ఉడికించాలి. ఉడికిన తరవాత స్టవ్‌మీద నుంచి దించి చల్లార్చాలి. చల్లారిన తరవాత తురుమును నీళ్లు లేకుండా పిండాలి. పిండిన నీటిని పారబోయకుండా పక్కన ఉంచాలి. తురుములో సెనగపిండి, కారం కలిపి కోలగా లేదా గుండ్రంగా ఉండలు చేసి పక్కన పెట్టాలి తరవాత ఓ బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరవాత ముందుగా చేసి ఉంచిన ఉండల్ని ఎర్రగా వేయించాలి. కడిగిన టొమాటోల్ని ముక్కలుగా కోసి మిక్సీలో వేసి రుబ్బాలి. తరవాత మసాలా దినుసులతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, నూనెలో కమ్మని వాసన వచ్చేవరకూ వేయించాలి. తరవాత అందులోనే రుబ్బి ఉంచిన టొమాటోలు, సొరకాయ నీరు పోసి రెండు నిముషాలు ఉడికించి గ్రేవీలా తయారుచేసుకోవాలి. చివరగా వేయించి ఉంచిన సొరకాయ ఉండలు కూడా వేసి కొత్తిమీర సన్నగా తరిగి పైన చల్లితే సొరకాయ కోఫ్తా రెడీ.

No comments:

Post a Comment