Wednesday, December 17, 2008
బాదం కీర్
కావలసిన పదార్థాలు:
పాలు ఒక లీటరు
బాదం పప్పుల ముద్ద ఒక కప్పు (నానపెట్టి పొట్టు తీయాలి)
తరిగిన బాదం పప్పు పావుకప్పు
కుంకుమ పువ్వు చిటికెడు
నెయ్యి ఒక స్పూన్
సన్నగా తరిగిన పిస్తాపప్పు కొంచెం
తయారు చేయువిధానం: మందముగా ఉండే గిన్నెలో పాలు పోసి సన్నటి సెగమీద కాగినాక బాదం ముద్దవేసి పాలపరిమాణం సగానికి అయ్యేవరకూ ఆపకుండా తిప్పుతూ ఉండాలి. తరువాత ఇంకొక గిన్నెలో నెయ్యి వేసి స్టవ్‌మీద పెట్టి బాదం ముక్కలు (పొట్టు తీసినవి) మరియు సన్నగా తరిగిన పిస్తా ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి ఆ పాలలో కలపాలి. దీని తర్వాత కుంకుమ పువ్వుని చల్లటి పాలలో కలిపి ఆ మిశ్రమాన్ని కాగుతున్న పాలలో కలిపాలి. చివరగా పంచదార వేసి ఇంకొంచెం సేపు కలియబెట్టి దింపాలి. ఇది చల్లారాకా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment